నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామం లో నిర్వహిస్తున్న స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ముగింపు సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో విజయవాడ శైలశ్రీ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. తాండవ నృత్యకారి, అంబపరకు, వినాయక కౌతం, జయము జయము, అష్టలక్ష్మి స్తోత్రం, జయ జయ వైష్ణవి, అదిగో అల్లదిగో, శంకర శ్రీగిరి, మాధవ కేశవా, దుర్గ అవతారం, గణేశా పంచరత్న, ఋతువు చక్రం, నమశ్శివాయతేయ్ , శివాష్టకం అంశాలను సత్య నందిని, రమ్య సాహితి, సూస్వేత, సుజయ, అర్చన, హేమాశ్రీ, కావ్య, హనీఫా, ఖ్యాతి, రాస్యలు నృత్య ప్రదర్శన చేశారు.






