శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ కాలనీలో ఉన్న శ్రీ తుల్జా భవానీ అమ్మవారి దేవాలయాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) సత్య చంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఆలయ చైర్మన్ బీకే రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు బీకే రాఘవరెడ్డి, రఘునాథ్ రెడ్డి తదితరులతో కలిసి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శ్రీ తుల్జా భవానీ అమ్మవారి కృప, ఆశీస్సులు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించానన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ప్రజలు, భక్తుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ అందరి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, ఆలయాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, ఆలయ చైర్మన్ బీకే రాజశేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు శ్రీనాథ్, పవన్, సత్యం, శిరీష, రేణుక, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రామచందర్, మిరియాల ప్రీతం, నటరాజ్, పాండు, ప్రవీణ్ రెడ్డి, మారం వెంకట్, చిన్నరెడ్డి, రామిరెడ్డి, దినేష్ బోరతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





