- యంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
- MCPI(U)లో పలువురు చేరిక
నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో యంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, నల్లగొండ జిల్లా కార్యదర్శి వసుకుల మట్టయ్య, సూర్యాపేట జిల్లా కార్యదర్శి యస్ కె నజీర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వరికుప్పల వెంకన్న, గోనె కుమారస్వామి, వడితియ తుకారాం నాయక్ సమక్షంలో పలువురు యంసిపిఐయు లో చేరారు. వారిలో ప్రముఖ ప్రజా కళాకారుడు, సామాజిక ఉద్యమ కారుడు, అమరజీవి కామ్రేడ్ భీంరెడ్డి నరసింహ రెడ్డి తో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న ఈదుల వీరపాపయ్య, కొండబోయిన బిక్షం, బాజ అరుణ్ కుమార్, పెరుమాండ్ల సామేలు, గుండెబోయిన ఆంజనేయులు, అనుబోలు హరిబాబు ఉన్నారు. ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సారథి నడయాడిన నేల తుంగతుర్తిలో ఎర్రజెండా ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి వీర పాపయ్య లాంటి కామ్రేడ్సు ముందుకు రావడం చాలా సంతోషం ఉందన్నారు. దోపిడీ పాలక వర్గంతో రాజి లేని ప్రజా పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. యంసిపిఐయు లో చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.