నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో గచ్చిబౌలి, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, హైదరనగర్, వివేకానంద నగర్, అల్విన్ కాలనీ, కూకట్ పల్లి డివిజన్లలో గణతంత్ర దినోత్సవం ఘనంగా వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా జాతీయ జెండాను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆవిష్కరించి జెండా వందనం చేశారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభదినాన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహానీయుడిని స్మరించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.