మహనీయులను నిత్యం స్మరించుకుందాం : కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి : 75వ గణతంత్ర దినోత్సవాన్ని కొండాపూర్ డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. డివిజన్ లోని సిద్ధిక్ నగర్, అంజయ్య నగర్, బంజారా నగర్, రాజీవ్ నగర్, న్యూ పీజేఆర్ నగర్, ఓల్డ్ పీజేఆర్ నగర్, మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీ, రాజా రాజేశ్వరి నగర్ కాలనీ, ప్రేమ్ నగర్ ఏ & బీ బ్లాకు లలో ఏర్పాటు చేసిన జాతీయ త్రివర్ణ పతాకాన్ని కార్పొరేటర్ హమీద్ పటేల్ ఎగురవేసి, గౌరవ వందనం చేశారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలో జాతీయ జెండా ఎగురవేసిన కార్పొరేటర్ హమీద్ పటేల్, పార్టీ నాయకులు

ఎంతోమంది దేశభక్తుల త్యాగఫలం మన భారతదేశంమని అన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా, నిస్వార్థంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహనీయులను స్మరించుకుంటూ, ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

చిన్నారులతో..

కార్యక్రమమంలో కాలనీ, బస్తీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, జాతీయ త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here