నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జి ల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం సప్తపది క్రిస్టల్ గార్డెన్స్ వేదికగా చందనగర్ లో జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నాగురావు నామాజీ, కర్ణాటక రాజరాజేశ్వరి నియోజకవర్గ శాసనసభ్యుడు మునిరత్నం కూడా నాయుడుతో కలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.