నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సమానత్వం, బహుజనులు హక్కుల పరిరక్షణకు కృషి చేసిన భారత మాజీ ఉపప్రధాని దివంగత డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 113వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వాడవాడల జరిగిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల, సంక్షేమ, ప్రజా సంఘాల నేతలు బాబు జగ్జీవన్ రామ్‌కు ఘనంగా నివాళులర్పించారు.
మాదాపూర్‌లో…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారామ్ కాలనీలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు రఘునాథరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలకు ప్రభుత్వ విప్ ఆరెకపుడి గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డా౹౹ బాబూ జగ్జీవన్ రామ్ గారు గొప్ప దార్శనికుడని తెలిపారు. ఆయన సేవలు ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని, ఆత్మ విశ్వాసమే ఆయుధం గా దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానుభావుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, తెరాస నాయకులు వాలా హరీష్ రావు, దొంతి శేఖర్, వెంకటేష్ గౌడ్, కాశినాథ్ యాదవ్, కంది జ్ఞానేశ్వర్, ముకెందర్, నరేందర్ గౌడ్, సయ్యద్ తహెర్ హుస్సేన్, ఆనంద్ గౌడ్, అశోక్,సంజు సాగర్, సుదర్శన్, లక్ష్మణ్, బాల చారి, జామీర్, కేశవ్, సీతారాం, శోభన్, మల్లేష్ గౌడ్, శివ, కమోజీ, నరేష్, దిలీప్, రాజు, గోపాల్, దాస్ తదితరులు పాల్గొన్నారు.
మసీద్ బండలో…
శేరిలింగంపల్లి బిజెపి సీనియర్ నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను మసీద్‌బండలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్‌యాదవ్ నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రవికుమార్‌యాదవ్ మాట్లాడుతూ నాటి సమాజంలో చదువుకు దూరమై వివక్షకు గురైన పీడిత దళిత జనుల కోసం జగ్జీవన్‌రామ్ చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ రావు, రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్, రాజు శెట్టి లక్ష్మీనారాయణ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, మల్లేష్ గౌడ్, వినోద్ యాదవ్, నరసింహ, బాల కుమార్, భరత్ కుమార్, సతీష్ కురుమ, సంతోష్, చందు, ఆకుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్‌లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ గ్రామంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జై బిమ్ నాయకులు, రాములు, వెంకటేష్, నరేందర్, జ్ఞానేశ్వర్, శ్రీహరి, కిషోర్ టిఆర్ఎస్ నాయకులు, మహేందర్ ముదిరాజ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, స్వామినాయక్, కృష్ణనాయక్, తిమ్మరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్‌లో…
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను బిజెఆర్‌వై సంఘం రాయదుర్గం ప్రధానకార్యదర్శి శ్యామ్లెట్ నర్సింహరాజు ఆధ్వర్యంలో రాయదుర్గంలోని కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ గంగాధరరెడ్డి హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమర యోధునిగా సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. స్వరాజ్య ఉద్యమంతోనే తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంలో సైతం బాబు జగ్జీవన్‌రామ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌లు ఆనాడే పునాదులు వేశారన్నారు. మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలి ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…
బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ ఎంఐజి కాలనీలో గల ఎస్ ఓ ఎస్ అనాధ శరణాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన అసోసియేషన్ కన్వీనర్ రామస్వామియాదవ్ విద్యార్థులకు బిస్కెట్లు, పండ్లు, స్టడీ మెటీరియల్, శానిటైజర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అనంతరం రామస్వామి యాదవ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ గారు స్వతంత్ర సమరయోధుడు , సామాజిక సమానత్వానికి , బహుజనులు హక్కుల పరిరక్షణకు కృషి చేసిన సామాజిక విప్లవవీరుడు అని అన్నారు. 27 సంవత్సరాలకే బీహార్ విధానసభకు ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు కేంద్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించిన పరిపాలనా దక్షులు అని కొనియాడారు. నేటి యువత బాబు జగ్జీవన్‌రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని బహుజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలా రంగనాయకమ్మ ట్రస్టు అధ్యక్షులు పోలా వాణి కోటేశ్వరరావు , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాదు , పాలం శ్రీను , జనార్దన్ , నల్లగొర్ల శ్రీనివాసరావు , జిల్ మల్లేష్ , శ్రీమతి సంధ్య , యాదవ్ కోవూరు ఆశ్రమ నిర్వాహకులు వికాస్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పాటుపడిన వ్యక్తి బాబూ జగ్జీవన్ రాం : జ్ఞానేంద్ర ప్రసాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్ నగర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ అభిమానులు రాజు, అనిల్, నర్సింగ్ రావు, వెంకట్, నగేష్, వినోద్, రజినీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
కులరహిత సమాజం కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్: ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ లో స్థానిక బిజెపి నాయకులు నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 113 వ జయంతి వేడుకలకు డివిజన్ బీజేపీ ఇంచార్జ్ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ భారత తొలి ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కుల రహిత సమాజం కోసం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాను యాదవ్, గణేష్ గౌడ్, సంతోష్ కుమార్, శేఖర్ గౌడ్, వినోద్, భీమ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.