నమస్తే శేరిలింగంపల్లి: గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గుడ్ల ధనలక్ష్మి సోమవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.