శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో అతి భారీ వర్షం నేపథ్యంలో గంట గంటకి పరిస్థితి గంభీరంగా మారుతుందని, డివిజన్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక కార్పొరేటర్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షాల నేపథ్యంలో గోపి చెరువు చాకలి చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం దాటడంతో లింగంపల్లి, తారా నగర్ లాంటి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తత ఉండాలని సూచించారు. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్న తరుణంలో ప్రజలంతా తమ ఇండ్ల నుంచి బయటకి రావొద్దని అన్నారు. అత్యవసరం ఐతే తప్పితే ఎవరు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలిగిన(ఎలక్ట్రికల్, రోడ్డు, డ్రైనేజీ) వెంటనే సంబంధిత అధికారులకు లేదా తమ కార్యాలయానికి సమాచారం అందివ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే శేరిలింగంపల్లి ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్ 91548 32003 లేదా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కంట్రోల్ రూం నెంబర్ 040-29555500లో సంప్రదించాలని సూచించారు.