పేటీఎమ్ కేవైసి పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

పే టిఎం కేవైసి పేరుతో మోసం చేసిన నిందితులు

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): పేటీఎం కేవైసి అప్ డేట్ చేస్తామంటూ అమయకుల అకౌంట్ నుండి లక్షల రూపాయలు దోచేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1లక్ష 47 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం…మియాపూర్ కు చెందిన ఓ మహిళకు సెప్టెంబరు 1వ తేదీన వినయ్ శర్మ(7478092505) అనే వ్యక్తి నుండి పేటీఎం అప్డేట్ చేసుకోవాలంటే మరో నెంబరుకు 8345989385 కాల్ చేయాలని సందేశం వచ్చింది. సదరు నెంబరుకు ఫోన్ చేయగా వినయ్ శర్మ మాట్లాడుతూ ఫోన్ ను తాను ఆపరేట్ చేయగలిగేలా ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. సదరు మహిళ అదే విధంగా చేయగా పే టీఎం తెరచి లాగిన్ చేయాలని సూచించాడు. బాధిత మహిళ పే టిఎం సందేశాలన్ని తన నెంబరుకు వచ్చేలా మార్పులు చేశాడు. అనంతరం నామమాత్రంగా రూ.1 నగదును క్రెడిట్ కార్డు గానీ, డెబిట్ కార్డు ద్వారా గానీ చెల్లించమని చెప్పడంతో సదరు మహిళ అదే విధంగా చేసింది. లావదేవి జరిగే సమయంలో ఉపయోగించే కోడ్ ను తనకు చెప్పమని వినయ్ శర్మ అడగగా మహిళ అదేవిధంగా చేయడం తో తన ఖాతాల నుండి రూ. 4,29,360లను కాజేశాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరంలో భాగస్వాములైన ఝార్ఖండ్ ప్రాంతానికి చెందిన నంకు మండల్@రాహుల్(27), రాజేష్ మండల్(26), శివశక్తి కుమార్(25), గౌరవ్ అరుణ్(46), దిల్ ఖుష్ కుమార్ సింగ్(18) లను ఆరెస్ట్ చేసిన పోలీసులు వారివద్ద నుండి లక్ష నలపై ఏడు వేల రూపాయల నగదు తో పాటు సెల్ ఫోన్లు, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. కాగా అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలను, అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోమని ఎవరైనా ఫోన్ ద్వారా సంప్రదిస్తే వారి మాటలను నమ్మవద్దని, పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

మోసం జరిగిన తీరు ఇలా…
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here