- దేశానికి సరిపడే క్రీడాకారులను అందిస్తాం
- 76వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: క్రీడాకారులు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి దేశానికి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో జూలై 2 నుండి 5 వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 76వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ను చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి , కార్యదర్శి ఉమేష్, హోప్ ఫౌండేషన్ చైర్మన్, చీఫ్ పాట్రాన్ కొండా విజయ్ కుమార్ తో కలిసి పాల్గొని ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా CM CUPను ఘనంగా నిర్వహించామన్నారు. తెలంగాణ నుండి దేశానికి సరిపడే క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని రూపొందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 వేల గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ స్టేడియాలను నిర్మిస్తున్నామన్నారు. దేశానికి, రాష్ట్రానికి పేరు తేస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి, విలువైన ప్రదేశాలలో ఇంటి స్థలాలను అందజేస్తున్ననామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మన ప్రాంతంలో 76వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1173 మంది క్రీడాకారులకు 39 కోట్ల 16 లక్షల 34 వేల రూపాయలను క్రీడా శాఖ ద్వారా ప్రోత్సాహక నగదును అందించామనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఈ అక్వాటిక్ ఛాంపియన్షిప్ లో జాతీయస్థాయిలో ప్రముఖ క్రీడా ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు. భారత్ నుండి ఒలంపిక్ పోటీల్లో పాల్గొన్న ప్రముఖ స్విమ్మర్స్ శ్రీహరి నటరాజ్, మన పటేల్, సజ్జన్ ప్రకాష్ లు పాల్గొంటారని తెలిపారు.
ప్యారిస్ లో నిర్వహిస్తున్న ఒలంపిక్ పోటీలతోపాటు ఇజ్రాయిల్ లో నిర్వహించే జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్, చైనాలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ కు జాతీయస్థాయి అక్వాటిక్ ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబరిచిన స్విమ్మర్స్ ను ఎంపిక చేస్తారనీ తెలియజేస్తమన్నారు. 4 రోజులపాటు నిర్వహించే ఈ చాంపియన్ షిప్ లో 42 ఈవెంట్లు జరుగుతాయనీ వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ఆర్గనైజింగ్ సెక్రటరీ సమంతా రెడ్డి, జగదీష్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు.