నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ నిర్యాణం చెందిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పరామర్శించారు.
అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయి సతీమణి రోధన వర్ణనాతీతంగా ఉండడంతో ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, బాలరాజ్ ముదిరాజ్, శేఖర్ గౌడ్, రవీందర్, సత్యారెడ్డి, బిఆర్ యువసేన నేతలు పాల్గొన్నారు.