విశ్వభారతం సంసృత కావ్యం ఆవిష్కరణలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): సంస్కృత గ్రంథాలను చదువుతూ వాటి అర్థాలను తెలుసుకోవడం ద్వారా భాషపై పట్టు పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం మాదాపూర్ లోని అవధాన సరస్వతీ పీఠంలో బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ రచించిన సంస్కృత కావ్యం విశ్వభారతం గ్రంథాన్ని కవి, మహా మహోపాధ్యాయ రమాకాంత్ శుక్లా, తిరుపతి సంసృత యూనివర్సిటీ డీన్ ఆచార్య రాణి సదాశివమూర్తి, రచయిత నాగఫణి శర్మతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నాగఫణిశర్మ రచించిన విశ్వభారతం గొప్ప కావ్యమని ప్రశంసించారు. ఇటువంటి గ్రంథాలను చదివి అర్ధం చేసుకోవడం కొంత కష్టతరమైన పని అయినప్పటికీ భాషపై పట్టు సాధించడంతో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి గ్రంథాల ఆవశ్యకత ఉందని తెలిపారు. హిందువులంతా సంఘటితం అవ్వడం ద్వారానే దేశాన్ని కాపాడగలమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సాదు సంతులు, ప్రముఖులు హాజరయ్యారు.