గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లికి చెందిన తెరాస నాయకుడు సురేందర్ కి పార్టీ సభ్యత్వ నమోదు పత్రాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్, తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ల ఆదేశాల మేరకు శేరిలింగంపల్లిలో రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయాలని అన్నారు. ప్రతి కుటుంబాన్ని పార్టీ సభ్యత్వం కోసం సంప్రదించాలని, పార్టీలో చేరే విధంగా చూడాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. పార్టీ అభ్యున్నతికి కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు అనిల్, రమేష్ పాల్గొన్నారు.
