నమస్తే శేరిలింగంపల్లి: సమాజంలో అన్ని వర్గాల ప్రజల సమానత్వాన్ని కాంక్షించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిబా పూలే గారి 194 వ జయంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో తెరాస నాయకులు సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు గాంధీ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి అని కొనియాడారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత, బహుజన, మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా ఫూలే కార్యాచరణ మహోన్నతమైనదని, కుల,లింగ వివక్షకు తావు లేకుండా అందరికీ విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే విశ్వాసాన్ని నమ్మిన గొప్ప మేధావి అని అన్నారు. స్త్రీలు విద్యావతులైనప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, విద్య లేనిదే వికాసం లేదు, వికాసం లేనిదే పురోగతి లేదు, పురోగతి లేనిదే ప్రగతి లేదని, ప్రగతి లేకనే శుద్రులు అతిశుద్రులు అధోగతిపాలైనారని అందరికీ విద్య అందాలని ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆయన జీవితం అందరికి మార్గదర్శకం కావాలి అని, యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు చెన్నం రాజు, సత్యనారాయణ, నరేష్,యాదగిరి, నర్సింహ రాజు,నవాజ్, వెంకటేష్,అనిల్,కృష్ణ ,భిక్షపతి,జితేందర్, జనార్దన్ అంజమ్మ, అంజలి,ఎల్లమ్మ,కుమారి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
వివేకానందనగర్లో…
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా తెరాస నాయకులు శ్రీ కొమ్మగళ్ల మోజేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గాంధీ నివాసంలో నిర్వహించిన వేడుకల్లో ఆరెకపూడి గాంధీ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, సమ్మా రెడ్డి, కృష్ణ రావు, బ్రిక్ శ్రీను, కాశినాథ్ యాదవ్,రాము,సాలయ్య తదితరులు పాల్గొన్నారు.