కిష‌న్‌రెడ్డి, ర‌ఘునంద‌న్‌రావుల‌తో నాగార్జున సాగర్‌లో బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజ‌న మోర్చ అధ్య‌క్షుడు హనుమంత్ నాయక్ ప్ర‌చారం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా హాలియ ప్రాంతంలో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావుల‌తో క‌ల‌సి రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్ ప్రచారం నిర్వ‌హించారు. బీజేపీ శ్రేణులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. డా.రవి నాయక్‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని స్థానిక ప్ర‌జ‌లను కోరుతూ వారు వాడ‌వాడ‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. అందరు క‌ల‌సి పాదయాత్ర చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఓటు వేయాలని అభ్యర్థించారు. హాలియా మిర్చి రైతుల సమస్యలను తెలుసుకొని మిర్చి రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూసుకుంటాం అని హామీ ఇచ్చారు. అనంతరం హాలియ మున్సిపాలిటీ ఇంచార్జ్ జర్పుల కళ్యాణ్ నాయక్‌తో స‌మావేశమై స్థానిక స్థితిగతులు, ఎన్నికల పరిస్థితులపై హ‌న్మంత్ నాయ‌క్ ఆరాతీశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక, శేరిలింగంప‌ల్లి బిజెపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, నాగ‌ర్జున‌సాగ‌ర్ బిజెపి అభ్య‌ర్థి ర‌వినాయ‌క్‌ల‌తో క‌ల‌సి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న హ‌న్మంత్ నాయ‌క్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here