కలిసికట్టుగా పనిచేద్దాం.. భారీ మెజార్టీతో కాసానిని గెలిపిద్దాం

  • సాయి నగర్ వెస్ట్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీ, రాఘవేంద్ర కాలనీల వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నట్లు వారు ప్రకటించారు.

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీ, రాఘవేంద్ర కాలనీల వాసులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దామని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడపకి వెళ్లి.. అందరూ కలిసి కట్టుగా పనిచేసి సమిష్టి కృషితో పని చేద్దామని వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాలనీవాసులతో ఎమ్మెల్యే గాంధీ

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here