- బీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అన్వర్ షరీఫ్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా ఆ పార్టీ సీనియర్ నాయకులు కలిసి కట్టుగా పనిచేసి భారీ మెజార్టీ అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిని అభివృద్ధిని వివరిస్తూ పార్టీ కరపత్రాలు అందజేసి మరోసారి కారు గుర్తుకు ఓటేసి తమ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ అందించాలని ప్రజలను కోరారు.
ఇందులో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలో పలుకాలనీలు, ప్రగతి ఎన్ క్లేవ్, నీలిమా గ్రీన్స్, నీలిమా హైట్స్, రాధా మాధవ అపార్ట్ మెంట్స్, హిమదుర్గా అపార్ట్ మెంట్స్ వద్ద బీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అన్వర్ షరీఫ్ అధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన వచ్చిందని, కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని అన్వర్ షరీఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్ ముదిరాజ్, కిరణ్ యాదవ్, మహేందర్ ముదిరాజ్, ప్రసాద్, గంగాధర్, ఖాజా పాల్గొన్నారు.