శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మయూరి నగర్ కాలనీ వాసులు, నైలా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు, కేకే ఎన్క్లేవ్ కాలనీవాసులు ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవి కటాక్షంతో ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలని, దీపాల కాంతులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి మియాపూర్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కాలనీవాసులతో తన ఆత్మీయ అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుందని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీ వాసులు రామరాజు, కిషోర్, నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, హరికృష్ణ, వెంకట్, నైలా అపార్ట్మెంట్స్ వాసులు కేఎల్ఎన్ స్వామి, శ్రీనివాస్, మురళి, వెంకటేష్, నరేష్, కేకే ఎన్క్లేవ్ కాలనీ వాసులు దుర్గా ప్రసాద్, వెంకటేశ్వర్ రావు, ప్రసాద్ రాజు, నాగరాజుతో పాటు మియాపూర్ డివిజన్‌కు చెందిన పలువురు ప్రముఖులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.





