శేరిలింగంపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజల జీవితాల్లో సంతోషం, వెలుగులు నిండాలని కోరుకున్నారు. అనంతరం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యలమంచి ఉదయ్ కిరణ్, వి. జగదీశ్వర్ గౌడ్‌ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి వారి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని అభిలషించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్‌చార్జులు, మైనారిటీ నాయకులు, లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మియాపూర్ డివిజన్ నాయకులు వంశీ, నవీన్, చిరంజీవి, ప్రవీణ్, నాగసాయి, గురువులు, సాయి లోహిత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here