గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్ సి-బ్లాక్‌, ఏడో అంతస్తులోని ఫ్లాట్‌ నంబర్‌ 702లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మారెడ్డి (65), అత‌ని భార్య బత్తుల భారతి (60), కుమారుడు బత్తుల నిశాంత్‌ రెడ్డి (38) గత ఏడాది కాలంగా సదరు అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. నిశాంత్‌ రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటున్నారు.

నవంబర్‌ 8వ తేదీన‌ ఉదయం సుమారు 8:40 గంటలకు అపార్ట్‌మెంట్‌ నుంచి సమాచారం అందడంతో గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, కుటుంబపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనకు దారితీసిన అసలు కారణాలు, పరిస్థితులు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. సైదులు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here