శేరిలింగంపల్లి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ శేరిలింగంపల్లి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలందరికీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపాల పండుగ ప్రతి ఒక్కరి ఇళ్లలో కొత్త వెలుగులు నింపాలని, కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలగకుండా, ప్రమాదాలకు తావులేకుండా కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు అండగా నిలుస్తానని రవికుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణ, సీనియర్ నాయకులు పట్టాభిరామ్, శ్రవణ్, రంగస్వామి, బసవ శివ, అభి తదితరులతోపాటు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్ల నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here