ఆరోగ్యపరమైన లేదా మతపరమైన లేదా జంతువుల పట్ల ప్రేమతో లేదా జంతువులపై ఎక్కువగా యాంటీ బయాటిక్స్ లేదా హార్మోనులు అంటే హానికరమైన మందులు వినియోగిస్తున్నారనో లేదా ప్రకృతి యొక్క నిర్థరక ఉపయోగాన్ని తగ్గించుకోవడానికని
లాంటి ఎన్నో కారణాలుగా శాఖాహారులుగా మారుతుంటారు. ఇక బీదరికం కారణంగా పలువురు శాఖాహారినికే
పరిమితమవుతుంటారు కూడా. ఇలా శాఖాహారిగా మారడం ఎందరికో ఒక విధానంగా మారిపోయింది. అందుకు ప్రధానంగా తాజా కూరగాయలు సంవత్సరం పొడుగునా దొరుకుతుండడంతో పాటూ వీటితో ఎక్కువ రకములైన పదార్థములు వండగలగడం, కొన్ని ప్రాంతాల వంటకాలలో ఎక్కువగా అక్కడ దొరికే మొక్కలు, కూరగాయలు వినియోగించడం కారణమని కూడా చెప్పవచ్చు. అయితే ఇటీవల వరకూ శాఖాహారం పై జరిగిన పరిశోధనలు ఎక్కువగా శాఖాహారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలి లేదా అందుతున్నదనే విషయంపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తే ఇపుడు అవి అందించే ఆరోగ్యపరమైన లాభాలపై కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే శాఖాహారం కారణంగా ఎన్నో దీర్ఘకాలిక రుగ్మతలు రాకుండా లేదంటే వాటి ప్రభావాన్ని
తగ్గించుకోవడానికి ఉపయోగపడుతున్నాయనే అంశం స్పష్టమవుతోంది.
ఇదంతా నాణానికి ఒకవైపు అయితే రెండో వైపు ప్రతీ వాదనకు ప్రతివాదన ఉంటుంది. అలానే శాఖాహారం పై ప్రజలలో కూడా ఎన్నో అపోహలు పాతుకొని ఉన్నాయి. ఏటా 1 అక్టోబర్ నాడు జరుపుకొనే ప్రపంచ శాఖాహారి దినోత్సవ సందర్భంగా ఈ అపోహలపై నిపుణుల జవాబులు చూద్దాం …..
శాఖాహారం లో శరీరానికి అవసరమైన ప్రోటీస్ దొరకదు?
శాఖాహారం కారణంగా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభ్యం కావనేది ఒక పెద్ద అపోహ. శాఖాహారంలో భాగమైన పప్పు ధాన్యాలు, మొలకలెత్తిన విత్తనాలు, ఓట్స్, సోయా, బాదం, అక్రోట్ లాంటి డ్రై ఫ్రూట్స్, బీన్స్, విత్తనాలు, పాలు మరియు పాల పదార్ధములైన పన్నీరు వంటి వాటిలో ప్రోటీన్లు ఉండి అవసరమైనంత దొరుకుతాయి.
శాఖాహారం వంటకాలు రుచిగా మరియు వైరటీ గా ఉండవు?
ఇతర ఆహార పదార్థముల వలే శాఖాహార ఆహార పదార్థములు కూడా రుచిగానే ఉంటాయి. శాఖాహార పదార్ధములతో ఎన్నో
రకములైన వంటలు చేయవచ్చు. అంతే గాకుండా సంపూర్ణ పోషకాలు అందించేలా ఈ వంటలను మలచుకొని సరికొత్త వంటకాలుతయారు చేయవచ్చు. ఇందులో ఉంటే వైరటీలు జిహ్వచాపల్యాన్ని చక్కగా సంతృష్టపరుస్తుంది.
శాఖాహారిగా ఉంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా?
పూర్తిగా శాఖాహారిగా ఉంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక వేళ మీరు పూర్తిగా నాన్ వెజిటేరియన్ గా ఉంటూ శాఖాహారిగా
మారితో మాత్రం మీ కడుపు పూర్తిగా నిండడం లేదనే భావన కలుగవచ్చు. అయితే దీనిని తగ్గించడానికి ఎక్కువగా పప్పులు,
కూరగాయలు, సలాడ్ లు తీసుకోవడం చేయాలి.
జీవితమంతా శాఖాహారిగా ఉండడం సాధ్యమేనా? శాఖాహారిగా ఉండడం వలన వచ్చే నష్టాలేమీ లేవు. అయితే తీసుకొనే ఆహారంలో శరీరానికి అవసరమైన అన్ని పౌష్టిక పదార్థములుఉండేలా మేళవించి పదార్థములు రూపొందించి ఆహారాన్ని సంపూర్ణ పౌష్టికాహారంగా మలచుకోవాలి.
మాంసాహారులకన్నా శాఖాహారులు ఆరోగ్యంగా ఉంటారా?
సాధారంగా శాఖాహారంలో జంతువుల ప్రొటీన్, కొలెస్ట్రాల్ మరియు కొవ్వు తక్కువగా ఉండి ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దాని కారణంగా ఊబకాయం, హృదయ సంబంధిత రోగాలు, అధిక రక్తపోటు, కొన్ని రకములై క్యాన్సర్ ల ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయితే మానవుని జీవన శైలి కూడా శాఖాహారం అందించే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్య శైలి తో పాటూ సంపూర్ణపోషకాలు అందించే ఆహారం తీసుకొంటే మాత్రం తప్పకుండా మంచి ఆరోగ్య ఫలితాలే వస్తాయి.
ఇక శాఖాహారం కారణంగా ఆరోగ్యకరమైన బరువు ఉంటుందా?
శాఖాహారం తీసుకోవడం వలన సాధారణంగానే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే శాఖాహారం తక్కువ కొవ్వు
మరియు కాలరీలు కలిగి ఉంటుంది. అలానే మొక్కల ఆధారిత ఆహారంలో ఎక్కువగా ఫైబర్ మరియు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్
ఉండడం వలన మెటబాలిజం ను అదుపులో ఉంచుతుంది. దీంతో మీరు ఎక్కువ కాలరీలను వినియోగిస్తూ కొవ్వును కరిగిస్తూ ఉండి తద్వారా బరువు పెరుగకుండా ఉంటుంది.
నేను మాంసాన్ని ఎక్కువగా ప్రేమిస్తాను అయితే శాఖాహారిగా మారలనుకొంటున్నాను ….. అయితే ఎలా?
ఎవరైనా వారి అలవాట్లు మార్చుకోవాలనుకొనే ముందు దానిపై పూర్తి అవగాహన కలిపించుకొని నమ్మకం ఏర్పరచుకొని గట్టిగా
ప్రయత్నించాలి. ఈ ప్రక్రియలో ముందుగా ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ ఇబ్బందులు, భావనలు ఎదుర్కొంటూ సంపూర్ణ
పౌష్టికాహారాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగితే మాత్రం పెద్దగా భేదాలు తెలియకుండానే మాంసాహారి నుండి శాఖాహారిగా మారిపోతారు.
శాఖాహారిగా ఉండడం వలన ఖర్చు పెరుగుతుందా లేదా తగ్గుతుందా?
మాంసాహార భోజనం కన్నా శాఖాహారం భోజనం ఖర్చు తక్కువ. ఈ తేడా 30 నుండి 50 శాతం వరకూ గమనించవచ్చు.
శాఖాహార భోజనంలో విటమిన్ బి 12 ఉండదు?
శాఖాహారంలో బి 12 విటమిన్ తప్ప శరీరానికి కావల్సిన అన్ని విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. ఎందుకంటే బి 12 అనే విటమిన్ కేవలం జంతువుల మాంసంలో మాత్రమే లభిస్తుంది కాని మొక్కల ద్వారా దొరికే ఆహార పదార్ధములలో ఉండదు. దీనికిప్రత్యామ్నాయంగా బి 12 విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పలు రకములైన ఆహార పదార్ధములు అంటే ఫోర్టిఫైడ్ సిరియల్స్, సోయా ఉత్పత్తులలో బి 12 కలిపి విక్రయిస్తున్నారు. వీటి వినియోగం ద్వారా ఈ లోటు తీర్చుకోవచ్చు.
సంపూర్ణ పౌష్టికాహారం శాఖాహారులకు ఏఏ ఆహార పదార్థముల నుండి లభిస్తుంది? క్రింద పేర్కొన్న ఆహార పదార్థముల నుండి శరీరానికి అవసమరైన పౌష్టికాహారాన్ని పొందవచ్చు.
- విటమిన్ బి 12-పాలు, పాల ఉత్పత్తులలో కొద్ది మాత్రం, బి 12 విటమిన్ కలిపిన ఫోర్టిఫైడ్ సిరియల్స్ లేదా ఆహార
పదార్ధములలో, సోయా, బ్రెడ్ వంటి ఉత్పత్తులలో - విటమిన్ డి-పాలు మరియు పాల ఆధారిత ఉత్పత్తులన్నింటిలోనూ మరియు సూర్మరశ్మి.
- కాల్షియం-పాల ఉత్పత్తులు, ముదురు ఆకుపచ్చ రంగు ఆకు కూరలు, బ్రొకొలి, బాదం, రాగులు, టోపు వంటి వాటిలో
- ప్రోటీన్లు-పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, టోఫు, సోయా ఆధారిత ఉత్పత్తులు, ఎండబెట్టి బీన్స్, పలు రకములైన గింజలు, మఫ్రూం వంటి వాటిలో
- ఇనుము-గుడ్లు, ఎండబెట్టిన బీన్స్, డ్రై ఫ్రూట్స్, తృణ ధాన్యాలు, పచ్చని ఆకుకూరలు, రాగి, ప్రొమోగైనెట్, బీట్ రూట్, కారెట్, బెల్లం, అటుకులు వంటి వాటిలో
చిన్న పిల్లలకు, ఆటగాళ్లకు, గర్భవతులైన మహిళలకు శాఖాహారం సరైనది కాదు?
సరైన రీతిలో రూపొందించబడిన శాఖాహారం అన్ని రకములైన మానవులకు సంపూర్ణ పౌష్టికాహారం అందిస్తుంది. అందులో పిల్లలు, ఆటగాళ్లు లేదా గర్భవతులైన మహిళలు కూడా. అయితే ఆయా వర్గాల వారికి ఎలాంటి సంపూర్ణ ఆహారం అందించాలో అవగాహన పెంచుకొని తదనుగుణంగా ఆహారాన్ని తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు గర్భవతులకు ఎక్కువగా ఐరన్ లేదా విటమిన్ సి ఉంటే ఆహారాన్ని అందించాలి. ఇందుకోసం వారు సాధారణంగా తీసుకొనే ఆహారంతో పాటూ జామపండు లేదా ఉసిరి చిన్న మొత్తంలో తీసుకొంటే సరిపోతుంది. ఇక చిన్నారుల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు శాఖారంలో ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికిచ్చే ఆహారంలో ఎక్కువ కాలరీలు ఇచ్చే పలుకరములైన వంటకాలను చేర్చగలిగితే వారు రుచులు ఆస్వాదిస్తారు. ఇక ఆటగాళ్లకు ఎక్కువ శక్తి, మరింత సమర్థవంతంగా పని చేయడానికి అవసరమైన పోషకాలన్నీ శాఖాహారంలో ఉంటాయి. అయితే అన్ని రకములైన పోషకాలు, మినరల్స్ ఉండేలా మెనూ రూపొందిస్తే సరిపోతుంది.
శరీరంలో ఉండే ఎముకల దారుఢ్యం పెరగడానికి శాఖాహారంలో పాల ఉత్పత్తులు తప్పనిసరా?
శాఖాహార ఆహారంలో పాల ఉత్పత్తుల ద్వారానే కాకుండా ఎముకల దారుడ్యానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి మరియు
ప్రోటీన్లు పలు రకములైన ఆకుకూరలు, బాదంపప్పు మరియు విత్తనాలలో దొరుకుతాయి. వీటిలో దొరికే కాల్షియం లో ఆక్సలేట్లు
ఎక్కువగా ఉండి ఎముకలు కాల్షియాన్ని ఇముడ్యుకొనే స్థాయిని తగ్గిస్తాయి కూడా.
ఒక వేళ మీరు జంతువుల నుండి వచ్చే పాల ఉత్పత్తులు కూడా తీసుకోకూడదని భావిస్తే అందుకు తగినట్లుగా ఆకుకూరల
వినియోగం పెంచడంతో పాటూ సోయా పాలు, పలురకములైన సిరియల్స్, ఆరెంజ్ జ్యూస్, టోఫూ వంటి వాటిని తీసుకోవాల్సి
ఉంటుంది. దీంతో పాటూ సరైన వ్యాయామం చేయడం ద్వారా ఎముకల సామర్ధ్యాన్ని దారుడ్యాన్ని, పెంచుకోవచ్చు.
Article is prepared by V. Krishna Deepika, Clinical Dietician, Apollo Cradle & Children’s Hospital,
Kondapur, Hyderabad