శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శాంటా మేరీ స్కూల్ పక్కన ఉన్న ఓపెన్ స్థలంలో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్రీ ప్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ ను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేంందర్ యాదవ్ తో కలిసి శుక్రవారం ప్రభుత్వ విప్, శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. అనంతరం టాయిలెట్స్ ను శుభ్రం చేసే వెహికిల్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రవిందర్ ముదిరాజ్, నాయకులు బద్దం కొండల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, గడ్డ సత్యనారాయణ, మహేష్ యాదవ్, కె ఎన్ రాములు, నట్ రాజ్, రమణ, జగదీష్, వార్డు మెంబర్లు పొడుగు రాంబాబు, కొడిచర్ల రాము తదితరులు పాల్గొన్నారు.
