ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బాలరామ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట పూజలు

  • పాల్గొని పూజలు చేసిన గుల్మోహన్ పార్క్ కాలనీ అధ్యక్షులు షేక్ కాసిం, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరం ప్రతిష్టాపన శుభ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ శేరిలింగంపల్లి గుల్మోహన్ పార్క్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ బాలరామ విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుల్మోహన్ పార్క్ కాలనీ అధ్యక్షులు షేక్ కాసిం, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సద్గుణాలు కలిగిన ఆ శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని జీవించాలని అన్నారు.

గుల్మోహన్ పార్క్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ బాలరామ విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలలో..గుల్మోహన్ పార్క్ కాలనీ అధ్యక్షులు షేక్ కాసిం, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్

అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రతిష్టాపన దేశ ప్రజలందరికీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచం అని అన్నారు. దేశ ప్రజలందరి మీద ఆ శ్రీరాముని అండదండలు, ఆశీర్వచనాలు ఉంటాయని అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిస్తారని ఈ సందర్భంగా ఆ శ్రీరాముని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అర్జున్ రావు, ఉపాధ్యక్షులు మోహన్ రావు, జయరాజ్, సత్యం, సమీర్, ప్రభాకర్ చారి ,ఆనంద్ రావు, బిల్డర్ వెంకటేశ్వర్లు, గారెల వెంకటేష్ ముదిరాజ్, నర్సింగరావు, గుల్మోహర్ పార్క్ యూత్ అసోసియేషన్ సభ్యులు నాగరాజు, శ్రీను, వాసు, శ్రీనివాస్, రామ్ రెడ్డి, రాజిరెడ్డి, సతీష్ రెడ్డి , నేతాజీ నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు డీజే భవన్, భగత్, అశోక్ శ్రీ రామ భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here