- భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: కోట్లాది మంది భారతీయుల హిందువుల నమ్మకానికి ప్రతీక అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అని భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు.

గచ్చిబౌలి డివిజన్, లింగంపల్లి డివిజన్ , కొండాపూర్ డివిజన్, ఆల్విన్ కాలనీ డివిజన్, వివేకానంద నగర్ డివిజన్ , మియాపూర్ డివిజన్ ,హఫీజ్ పేట్ డివిజన్, చందానగర్ డివిజన్ లలో శ్రీ రాముని శోభాయాత్ర కార్యక్రమాలు , బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష వీక్షణ, పూజలు , అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. కోట్లాది మంది భారతీయుల 550 సంవత్సరాల నాటి స్వప్నం అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం , అందరి కలలను సాకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం నేడు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలందరికి అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ శుభాకాంక్షలు తెలిపాటు.

స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమాలలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.