ఎందరికో న్యాయం చేసి… కుటుంబానికి అన్యాయం

కోవిడ్ అనుమానంతో విశ్రాంత న్యాయమూర్తి ఆత్మహత్య

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ఆయన ఒక విశ్రాంత న్యాయమూర్తి. తన విధి నిర్వహణలో ఎంతో మందికి న్యాయం చెప్పిన అతడు తన సొంత కుటుంబం విషయంలో మాత్రం అన్యాయం చేశాడు. కోవిడ్ సోకిందనే అనుమానంతో తన కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలుగకూడదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ పెద్దాయన. సూసైడ్ నోట్ వ్రాసి పెట్టి తన గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం… మియాపూర్ న్యూ సైబర్ వ్యాలీ లోని నవనామి ఎలైట్ ఫ్లాట్ నెంబర్ 302 లో రాజీవ్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా రాజీవ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ప్రతిరోజూ తన గదిలో ఒంటరిగా నిద్రపోయేవాడు. ఇదే క్రమంలో గురువారం రామచంద్ర రెడ్డి తన గదిలో నిద్ర పోగా శుక్రవారం ఉదయం రాజీవ్ రెడ్డి తల్లి గది తలుపు తెరిచి చూడగా రామచంద్ర రెడ్డి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉన్నాడు. వెంటనే రాజీవ్ రెడ్డి తాడును కత్తిరించి చూడగా అప్పటికే రామచంద్ర రెడ్డి మృతి చెందాడు. కాగా మృతుడు రాసిన సూసైడ్ నోట్ లో తనకు కరోనా సోకినట్లు అనుమానంగా ఉందని, కుటుంబ సభ్యులకు తన వల్ల ఇబ్బంది కలుగకూడదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొని ఉండటం గమనార్హం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కోవిడ్ వైరస్ తీవ్రత కంటే కూడా వ్యాది సోకిందనే భయాందోళనతోనే చాలా మంది మృతి చెందుతున్నారు. న్యాయమూర్తిగా పనిచేసి విశేష అనుభవం కలిగిన రామచంద్ర రెడ్డి లాంటి ప్రముఖులు ఇలా దూరమవడం బాదాకరం. 

Advertisement

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here