వినాయకనగర్ లో కార్పొరేటర్ సాయిబాబ పర్యటన

సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తున్న కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబ

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వినాయకనగర్ లో స్థానిక కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ పర్యటించారు. శుక్రవారం స్థానిక నాయకులతో కాలనీలో పర్యటించిన ఆయన డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన డివిజన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం పాటు పడుతున్నట్లు తెలిపారు. సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో సాయిబాబ తో పాటువర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్, కాలనీవాసులు యాదయ్య, వెంకటేష్, రాము తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here