హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల్లో ప్లాస్మా, రక్తదానాల పట్ల అవగాహన కల్పించేందుకు గాను రూపొందించిన ఓ పాటను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కలివేముల వీరేశం గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు. బ్లడ్ 2 లీవ్ సంస్థ వ్యవస్థాపకుడు పట్టుపోగుల పవన్ కుమార్ ఆధ్వర్యంలో మదీనాగూడలోని మదర్ థెరిసా బ్లడ్ బ్యాంక్ సంస్థ వ్యవస్థాపకుడు మల్లేశ్వరరావు సౌజన్యంతో సదరు పాటను రూపొందించారు. ఈ కార్యక్రమంలో కె.సత్యనారాయణ గౌడ్, ఎన్ సంతోష్ రెడ్డి, కె సంతోష్ కుమార్, బ్లడ్ 2 లీవ్ సిబ్బంది, మదర్ థెరిసా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.