నమస్తే శేరిలింగంపల్లి: అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులను శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.రవికుమార్‌యాదవ్ పరామర్శించారు. శుక్రవారం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డితో కలిసి పరామర్శించిన రవికుమార్ యాదవ్ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనకు గల కారణాలను పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
