శేరిలింగంప‌ల్లిలో శోభాయమానంగా చ‌త్ర‌ప‌తీ శివాజీ జ‌యంతి శోభ‌యాత్ర‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి:చ‌త్ర‌ప‌తి శివాజీ జ‌యంతిని పుర‌స్కరించుకుని విశ్వ‌హిందు ప‌రిష‌త్‌, విశ్వ‌క‌ర్మ జిల్లా సంయుక్త ఆధ్వ‌ర్యంలో శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో శోభాయాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మియాపూర్ శివాల‌యం నుండి తారాన‌గ‌ర్ తుల్జాభ‌వానీ దేవాల‌యం వ‌ర‌కు భారీ బైక్ ర్యాలీతో పాటు శివాజీ విగ్ర‌హ ఊరేగింపు కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా మ‌హా మండ‌లేశ్వ‌ర‌యాద‌వ్ మ‌హారాజ్‌, విశ్వ‌హిందూ ప‌రిష‌త్ జిల్లా అధ్య‌క్షులు శ్రీ‌నివాస‌రావు, రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర మ‌హారాజ్ శిష్యులు నిత్య ‌గోపాల్‌దాస్ లు హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా ప‌లువురు వ‌క్త‌లు మాట్లాడుతూ హిందు ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌త్ర‌ప‌తి శివాజీ ఎన‌లేని సేవ‌లు చేశార‌న్నారు. స‌మ‌స్త హిందూ జాతి పౌరుషానికి శివాజీ ప్ర‌తీక‌గా నిలిచార‌ని, నేటి యువ‌త ఆయ‌న చూపిన బాట‌లో న‌డిచి హిందు ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు పాటు ప‌డాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజేపి నేతలు జ్ఞానేంద్ర ప్రసాద్, కసిరెడ్డి భాస్కర రెడ్డి, రవి కుమార్ యాదవ్, పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, మూల అనిల్ కుమార్ గౌడ్, మారం వెంకట్, శ్రీశైలం యాదవ్, బోయిని మహేష్ యాదవ్, రఘునాథ్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి, కలివేముల మనోహర్, రాజశేఖర్, రవిగౌడ్, సమ్మెట ప్రసాద్, గణేష్ ముదిరాజ్, శాంతిభూషన్ రెడ్డి, నారాయణ రెడ్డి, సత్య కురుమల‌తో పాటు వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here