నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లిలో బోనాల పండుగను ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేవంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అంతకుముందు వీరేష్ కి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
శేరిలింగంపల్లి ఇంచార్జి కట్ట వెంకటేష్ గౌడ్ డివిజన్ల అధ్యక్షులు ఆరేపల్లి సాంబశివ గౌడ్, సయ్యద్ సిరాజుద్దీన్, ఏరువా సాంబశివ గౌడ్, గొంది ఏమాద్రి నాయుడు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు పాతూరి వెంకట్రావు, కంకణాల వెంకటసుబ్బయ్య, కోటేశ్వరరావు, గౌతమ్, శ్రవణ్ ముదిరాజ్, అప్పలనాయుడు, రంగారెడ్డి, రియాజ్ పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన శేరిలింగంపల్లి పార్టీ కార్యాలయాన్ని సందర్శించి అన్ని వసతులతో నిర్మించినందుకు వెంకటేష్ గౌడ్ ని అభినందించారు. నియోజకవర్గ గెలుపు కోసం దశ దిశ చక్కటి సూచనలు అందించారు. టిడిపి జాతీయ పార్టీ కార్యదర్శి కాసాని వీరేష్ కి ఈ సందర్బంగా వెంకటేష్ గౌడ్ ధన్యవాదములు తెలిపారు.