నమస్తే శేరిలింగంపల్లి : వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినం సందర్భంగా నియోజకవర్గమంతటా దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో అశేశ జనవాహినితో కిటకిటలాడాయి.
ఇందులో భాగంగా చందానగర్, మైత్రి నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.