నమస్తే శేరిలింగంపల్లి: రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తుల జీవితాన్ని రక్షించినవారమవుతామని, యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు రవికుమార్యాదవ్ అన్నారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి రఘునాథ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిభిరానికి రవికుమార్యాదవ్ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునాథ్యాదవ్ తో కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రవికుమార్యాదవ్ మాట్లాడుతూ సామాజికి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గంగల రాధాక్రిష్ణయాదవ్, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






