నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక దృక్పథంతో మనం చేసే రక్తదానం ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాలను నిలబెడుతుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగంనాగేందర్యాదవ్ అన్నారు. బుధవారం పాపిరెడ్డినగర్ కాలనీలో గల రాజీవ్ గృహకల్ప ఫంక్షన్ హాలులో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మిర్యాల రాఘవరావు జన్మ దినాన్ని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ రాగం సుజాత యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని రాగం నాగేందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెసిఐ సికింద్రాబాద్ వాకర్ టౌన్ సభ్యులు, సంగం చారిటబుల్ బ్లడ్ బ్లాంక్ సిఇఒ గిరి యాదవ్, తెరాస డివిజన్ ప్రెసిడెంట్ వీరేశం గౌడ్, శ్రీనివాస్ రాజు, వార్డు మెంబర్ శ్రీకళ, కొండల్ రెడ్డి, బస్వరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్, పట్లోళ్ల నర్సింహా రెడ్డి, సాయి, సౌజన్య, భాగ్యలక్ష్మి, చంద్రకళ, సుధారాణి, కల్యాణి, రోజారాణి, జయ, కుమారి, గౌసియా, హరి, యోగి, వెంకటేశ్వరరావు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






