నమస్తే శేరిలింగంపల్లి: మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ 79వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పిసిసి ప్రతినిధి సత్యం రావు ఆదేశాల మేరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాఫిజ్ పెట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వైస్ చైర్మన్ జమీర్, నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు ఇలియాస్ షరీఫ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నడిమింటి కృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మిని ప్రియదర్శిని, మైనార్టీ అధ్యక్షులు జమీల్, నియోజకవర్గ సీనియర్ నాయకులు మల్లేష్, మహేష్, బిక్షపతి, భరత్ గాంధీ రెడ్డి, వెంకటేష్ గౌడ్, సయ్యద్, శ్రీశైలం, జనార్ధన్, నరసింహ, యూత్ కాంగ్రెస్ నాయకులు అఫ్రోజ్ ఖాన్, ఆసిఫ్, తౌసీఫ్, షఫీ, ఎన్ఎస్ యుఐ నాయకులు సమీర్, అభిషేక్ రాజ్, మోసిన్ మహిళా కాంగ్రెస్ నాయకులు అరుణ యాదవ్, తన్వీర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





