CM రిలీఫ్ ఫండ్‌తో ఇద్దరు బాధితులకు రూ.2 లక్షల సాయం

శేరిలింగంప‌ల్లి, జూలై 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఇద్దరు అత్యవసర వైద్య చికిత్స అవసరమైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మేరకు మంజూరైన CMRF-LOC పత్రాలను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో పెద్ద వరమని అన్నారు. ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తంగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ సహాయం అందించినందుకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ కాలనీకి చెందిన ఎం.డి. షాబుద్దీన్‌కు అత్యవసర వైద్య చికిత్స కోసం రూ.1,25,000 మంజూరైంది. హైదర్ నగర్ డివిజన్ హైదర్ నగర్‌కు చెందిన శోభ‌కు అత్యవసర వైద్య చికిత్స కోసం రూ.75,000 మంజూరైంది. ఈ ఇద్దరికీ కలిపి మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరైనట్లు ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణపతి, లియాకత్, అష్రఫ్, రాజన్, యాసిన్ మునీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here