ముగిసిన తెలంగాణ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు

  • ఉత్సాహంగా పాల్గొన్న బాలబాలికలు
  • విజేతలకు బహుమతులు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్

నమస్తే శేరిలింగంపల్లి: రెయిన్ బో స్కై ఆధ్వర్యంలో జరిగిన తొమ్మిదవ తెలంగాణ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023 పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ఈ పోటీల్లో బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికల విభాగంలో సింగిల్స్ విజేతగా లక్ష్మీ రిద్వాని టైటిల్ గెలుచుకున్నారు.

రన్నరప్ గా అనుసంజన రెండో స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో సింగిల్స్ లో జాగర్లమూడి యువ సూర్య విజేతగా నిలిచి టైటిల్స్ సొంతం చేసుకున్నారు. రన్నరఫ్ గా కృష్ణ భార్గవ్ నిలిచారు. బాలికల డబుల్స్ విభాగంలో లక్ష్మీ రిజ్వాని సరయు జంట టైటిల్ గెల్చుకోగా రన్నరప్ గా ఆరాధ్య రెడ్డి అవని రెడ్డి నిలిచింది. బాలుర డబుల్ విభాగంలో యువ సూర్య, మోహన్, కృష్ణ మోహన్ విజేతలుగా నిలవగా రన్నరప్ గా గిరివాసం శశాంక్ వనమాల నిలిచారు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మోహన్, కృష్ణ, లక్ష్మీ, రిజ్వేల్ టైటిల్ విజేతలకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ బహుమతులు అందజేశారు. అంతేకా ప్రైజ్ మనీ అందజేసి సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో టీవీ9 సీఈఓ రజినీకాంత్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె. లక్ష్మణ్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ముసరాంబాగ్ ఎక్స్ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here