శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌ను చందానగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు కుమార్ ఉప్పుటూరి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చందానగర్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా పనిచేయాలని సీఐ శ్రీధర్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఐ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజల సహకారంతో చందానగర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.






