శేరిలింగంపల్లిలో జన్ శిక్షన్ సంస్థాన్ నైపుణ్య శిక్షణ

శేరిలింగంప‌ల్లి, జూలై 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్‌లోని బాలింగ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్‌లో నిర్వహిస్తున్న జన్ శిక్షన్ సంస్థాన్ (JSS) నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వ‌హించారు. కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం విద్య మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక నైపుణ్యాన్ని నేర్చుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబంతోపాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

జన్ శిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు, చదువు మధ్యలో మానేసిన యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజ సేవలో ముందుంటూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న జేఎస్ఎస్ నిర్వాహకులను ఆయన అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమకు ఈ అవకాశం కల్పించిన జన్ శిక్షన్ సంస్థాన్ నిర్వాహకులు, శిక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ప్రతినిధులు, శిక్షకులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here