- పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీ చౌరస్తా మియాపూర్ వద్ద శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, డివిజన్ కార్పొరేటర్లు శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ… నాటి పాలకుల అరాచకాలను అణిచి వేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని అన్నారు.
మహనీయులు ఏ ఒక్క కులం కోసం కాకుండా అందరి కోసం పాటుపడ్డారని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి పాలకుల అరాచకాలను అణిచివేసి అణగారిన వర్గాల పేదల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు. అన్నివర్గాల వారు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని, ప్రజాస్వామిక స్పూర్తితో పోరాడడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతిఒక్కరూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రమేష్ గారితో పాటు మల్లికార్జున శర్మ,జి సంగారెడ్డి, నర్సింగరావు, శేఖర్ గౌడ్, కృష్ణ గౌడ్, టీ బాలరాజ్, అరుణ, పద్మ మోహిని, అంజద్ అమ్ము, సత్య రెడ్డి, సాయన్న,రమణ తదితరులు పాల్గొన్నారు