నమస్తే శేరిలింగంపల్లి: రహదారి నియమాలు, పాదచారుల భద్రతలపై శేలింగంపల్లి మండలంలోని లింగంపల్లిలోని త్రివేణి పాఠశాలలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం అవగాహన సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ఆర్ సి పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ పవన్ కుమార్ మాట్లాడారు.

50 సిసి లోపు వాహనాలను నడపటానికి తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం ఉండాలని చెప్పారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ కు అర్హులవుతారని తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసిపి వెంకట్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలుసుకొని పాటించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరి, ఈఆర్ ఓ సాయి నరసింహారావు, ప్రిన్సిపాల్ అనితారావు, క్యాంపస్ ఇన్చార్జి శ్రీనివాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
