నమస్తే శేరిలింగంపల్లి: రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని మైలర్ దేవుపల్లి లో శ్రీ దుర్గా కన్వెన్షన్ లో పుంజాల హరిచరణ్ గౌడ్,టీ. ప్రేమ్ దాస్ గౌడ్, కాశీ విశ్వనాధ్ గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి, జంటనగరాల కల్లుగీత సొసైటీలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను సన్మానించారు.

కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, మాజీ శాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామి గౌడ్, మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర గౌడ ప్రముఖులు బొమ్మగాని ప్రభాకర్ వట్టికూటి రామరావు గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బాలగౌని వెంకటేష్ గౌడ్, పోతగాని ఐలన్ గౌడ్, తాళ్ళ శ్రీశైలం గౌడ్, శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ప్రముఖులు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, అశోక్ గౌడ్ నేమూరి రాములు గౌడ్, మూల వెంకటేష్ గౌడ్, కూన సత్యం గౌడ్, కరుణాకర్ గౌడ్, రంగారెడ్డి జంట నగరాల కల్లుగీత సొసైటీ అధ్యక్షులు, సభ్యులు పెద్ద ఎత్తున గౌడ్స్ పాల్గొన్నారు.
