డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీ ని కలిసిన ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీ గా సత్యనారాయణ నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను తన నివాసంలో తెలంగాణ ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీ సత్యనారాయణను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెబుతున్న తెలంగాణ ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్

ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్టిఐ చట్టం గురించి వివరించి ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఆర్టిఐ చట్టం పోరాటం చేస్తుందని వివరించారు.

ఓ ఎస్ డి దీనికి సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం – 2005 అనేది ప్రతి పబ్లిక్ అథారిటీ పనిలో పారదర్శకత , జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి, ప్రభుత్వ అధికారుల నియంత్రణలో సమాచారాన్ని పొందేందుకు పౌరులకు సమాచార హక్కు, ఆచరణాత్మక పాలనను ఏర్పాటు చేయడానికి ఒక చట్టం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్రవంతి, బబ్లూ, భోగం విష్ణు, అఖిల, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here