అభివృద్ధి శూన్యం.. శిలాపలకాలకే పరిమితం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ డివిజన్ లోని శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ చందానగర్ డివిజన్ మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు రమణ కుమారి ఆధ్వర్యంలో దీప్తి నగర్ కాలనీలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి బీజేపీ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ రాఘవేందర్ రావు, రంగా రెడ్డి (అర్బన్)జిల్లా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చందానగర్ డివిజన్ అంధకారమైందని, డివిజన్ లో టాక్స్ లు ఫుల్లు, అభివృద్ధి నిల్లుగా తయారయిందని దుయ్యబట్టారు.


కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చెరువుల సుందరీకరణ పేరుతొ సుమారు చెరువులో మొత్తం నీరు తీసివేయడం వాళ్ళ గ్రౌండ్ వాటర్ లేక చుట్టూ పక్కల కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అస్తవస్థమైన రోడ్లు, డ్రైనేజీలు, శేరిలింగంపల్లి లో నివసిస్తున్న పేద ప్రజల ఇబ్బందులను పట్టించుకోని ప్రజానిధులను గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు చందర్ రావు, జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి గౌస్, డివిజన్ మహిళ మోర్చా అధ్యక్షురాలు శోభ దుబే, ఉపాధ్యక్షురాలు రమణకుమారి, ప్రధాన కార్యదర్శి రాధిక, డివిజన్, నర్సింహ రావు పంతులు, బూత్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here