నమస్తే శేరిలింగంపల్లి: క్రైస్తవ సమాజానికి అత్యంత వైభవంగా పవిత్రంగా భావించే మాసం. ఈ మాసంలో ఆధ్యాత్మికంగా ఏసు క్రీస్తు భక్తి చెంతనే ప్రతీరోజు ప్రార్థనలు, సువార్త సభలు నిర్వహించడం ఆనవాయితీ. త్వరలో క్రిస్మస్ పండుగ రానున్నది. ఇందులో భాగంగా ఆదివారం కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో.. సువార్త సభ నిర్వహించారు.
ఈ సభకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ చెప్పులు ధరించి సభా వేదికను అపవిత్రం చేశారని యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యవంశం ప్రలీత్ తెలిపారు. ఇదేనా, కులమతాలకు వారిచ్చే విలువని మండిపడ్డారు.