బిజెపి ఎస్‌సి మోర్చ రంగారెడ్డి అర్భన్ జిల్లా ఉపాధ్యక్షునిగా కె.సాయిక్రిష్ణకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్‌సి మోర్చ అధ్యక్షులు కొప్పు బాష క్రిష్ణకాంత్ కు నియామకపత్రాన్ని అందజేశారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, ఎస్‌సి మోర్చ ఐటి కన్వీనర్ రాహుల్, జిల్లా అధ్యక్షులు బాణాల ప్రవీణ్‌లకు క్రిష్ణకాంత్ ధన్యవాదాలు తెలిపారు. అందరి సలహాలను సూచనలను పాటిస్తూ జిల్లాలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
