శేరిలింగంపల్లి( నమస్తే శేరిలింగంపల్లి): రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీ లో గల పార్టీ కార్యాలయంలో డివిజన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జితేందర్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పథకాలను అర్హులు అందరికీ చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు క్రాంతి మాదిగ, డివిజన్ ఉపాదక్ష్యులు సి.హెచ్ బాలరాజు, కొడిదల బాబు, బీ.జే. వై.ఎం ఉపాదక్ష్యులు శ్రీకాంత్ జక్కుల, ప్రధాన కార్యదర్శులు పి. కిరణ్ కుమార్, మహేశ్ రాపన్, కార్యదర్శులు పి. జగదీశ్, అర్.బీ జితేందర్, చాక్రహరి రాజు, పి. బసంత్, పి. గిరి, కోశాధికారి పి. శివ, ఓ.బీ.సి అధ్యక్షులు పట్లోళ్ళ నరసింహ, ప్రధాన కార్యదర్శి అందవేని శ్రీనివాస్, ఐటీ సెల్ కన్వీనర్ సత్య కుర్మా, కో కన్వీనర్ సాయి వెంకట్, సీనియర్ నాయకులు నాంపల్లి రాజు, గజ్జల శ్రీనివాస్ చారి, రాజు పాల్గొన్నారు.