టిఆర్ఎస్‌లో ప‌లువురి చేరిక‌

టిఆర్ఎస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ

గ‌చ్చిబౌలి(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల హుడా కాల‌నీకి చెందిన పలువురు గచ్చిబౌలి డివిజన్ తెరాస సీనియర్ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో శ‌నివారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పార్టీ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ‌ పథకాల పట్ల ఆకర్షితులై ఎంతోమంది తెరాస పార్టీవైపు మొగ్గు చూపుతున్నార‌న్నారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కు పార్టీలో త‌గిన గుర్తింపు ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన మంజీరా నీరు అందిస్తున్నామ‌ని , పింఛన్లు, రైతులకు 24 గంట‌ల‌ ఉచిత విద్యుత్తు వంటి అనేక గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కెసిఆర్ గారిదేనని తెలియ‌జేశారు. తెరాస పార్టీని నియోజ‌క‌వ‌ర్గంలో మరింత బలపరుస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు చేరే విధంగా ప్ర‌తీ కార్య‌క‌ర్త‌ కృషి చేయాలనీ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ డైరెక్ట‌ర్‌ గణేష్ ముదిరాజ్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు , రామారావు ,సాత్విక్, శ్రీశైలం, గోపాల్ నాయక్, చరణ్ , శశాంక్ , గణేష్ , మహేందర్ , అనిల్ , నరేష్ , ఈ. నరేష్ , నాగరాజు , ఆర్. మోహన్, ఇయజ్, రాజేష్ , ప్రణీత్ , నితీష్ , రాజ్ కుమార్ , సుభాష్ , జి. సాత్విక్, రాహుల్ , రమేష్ , నోయెల్ అనూప్ రాజ్ ,అభిషేక్, సుభాష్ ,అష్రాఫ్ , సంపత్ , సుజిత్ , గిరి సాయి , సునీల్ కుమార్ , జ్ఞానేష్, సాయి కిరణ్ , సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన వారితో ప్ర‌భుత్వ విప్ అరికెపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here