అంబర్ పేటలో జరిగిన కుక్కల దాడిలో నాలుగెండ్ల బాలుడి మరణానికి జిహెచ్ఎంసి అధికారులే బాధ్యత వహించాలని, నగర పరిధి వీధి కుక్కలను ప్రజల నివాసాలకు దూరంగా తక్షణం తరలించాలని ఏఐఎఫ్ డివై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనింగ్ కమిటీ సభ్యుడు కే.శరీష్ డిమాండ్ చేశారు. స్థానిక స్టాలిన్ నగర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5.76 లక్షల వీధి వీధి కుక్కల అంటే ఈ మూడు సంవత్సరాలలో కేవలం 1.63 కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్లు జిహెచ్ఎంసి అధికారులు లెక్కలు చెబుతున్నారు.
కుక్కల శాస్త్ర చికిత్స కోసం సంవత్సరానికి రూ. 15 కోట్ల చొప్పున ఖర్చు ఇస్తున్నట్లు చెబుతున్న మూడు సంవత్సరాల లో వీధి కుక్కల సంఖ్య భారీగా పెరిగి పోయాయని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న వీధి కుక్కల ద్వారా ప్రజలకు పసిపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వీధి కుక్కల విషయంలో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో సుమారు 3 వేల మంది వరకు కుక్కకాటు బాధ్యులు చికిత్స చేసుకున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెప్తుందని అన్నారు. అంబర్ పేటలో జరిగిన వీధి కుక్కల దాడిలో బాలుని మరణానికి జిహెచ్ఎంసి పూర్తి బాధ్యత వహించి ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఏఐఎఎఫ్ డివై గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు.